Jesus Worship Telugu Songs
  • Home
  • Song Track
  • Request Track
  • More
    • Home
    • Song Track
    • Request Track
Jesus Worship Telugu Songs
  • Home
  • Song Track
  • Request Track

Welcome to Jesus Worship Telugu Songs

Find out more

అగ్ని మండించు

  

అగ్ని మండించు – నాలో అగ్ని మండించు (2)

పరిశుద్ధాత్ముడా – నాలో అగ్ని మండించు (2)

అగ్ని మండుచుండెనే – పొద కాలిపోలేదుగా (2)

ఆ అగ్ని లో నుండే – నీవు మోషేను దర్శించినావే (2)  ||అగ్ని||

అగ్ని కాల్చి వేసెనే – సిద్ధం చేసిన అర్పణను (2)

ఆ అగ్ని ద్వారానే – నీవు గిద్యోన్ని దైర్యపరచితివే (2)  ||అగ్ని||

అగ్ని కాన రానందునా – వారు సిగ్గు పడిపోయిరే (2)

నీ అగ్ని దిగిరాగా – నీవు ఏలియాను ఘన పరచినావే (2)  ||అగ్ని||

ప్రాణ ఆత్మ శరీరము – నీకే అర్పించు చున్నానయ్యా (2)

నీ ఆత్మ వరములతో – నను అలంకరించుమయా (2) ||అగ్ని||

Files coming soon.

అతిపరిశుద్ధుడా స్తుతి నైవేద్యము

అతిపరిశుద్ధుడా స్తుతి నైవేద్యము
నీకే అర్పించి కీర్తింతును (2)
నీవు నా పక్షమై నను దీవించగా
నీవు నా తోడువై నను నడిపించగా
జీవింతును నీ కోసమే – ఆశ్రయమైన నా యేసయ్యా            ||అతిపరిశుద్ధుడా||

సర్వోన్నతమైన స్థలములయందు నీ మహిమ వివరింపగా
ఉన్నతమైన నీ సంకల్పము ఎన్నడు ఆశ్చర్యమే (2)
ముందెన్నడూ చవిచూడని
సరిక్రొత్తదైన ప్రేమామృతం (2)
నీలోనే దాచావు ఈనాటికై
నీ ఋణం తీరదు ఏనాటికి (2)            ||అతిపరిశుద్ధుడా||

సద్గుణరాశి నీ జాడలను నా యెదుట నుంచుకొని
గడిచిన కాలం సాగిన పయనం నీ కృపకు సంకేతమే (2)
కృప వెంబడి కృప పొందగా
మారాను మధురముగా నే పొందగా (2)
నాలోన ఏ మంచి చూసావయ్యా
నీ ప్రేమ చూపితివి నా యేసయ్యా (2)            ||అతిపరిశుద్ధుడా||

సారెపైనున్న పాత్రగ నన్ను చేజారిపోనివ్వక
శోధనలెన్నో ఎదిరించినను నను సోలిపోనివ్వక (2)
ఉన్నావులే ప్రతిక్షణమునా
కలిసున్నావులే ప్రతి అడుగున (2)
నీవేగా యేసయ్యా నా ఊపిరి
నీవేగా యేసయ్యా నా కాపరి (2)            ||అతిపరిశుద్ధుడా||

Files coming soon.

Jesus Worship Telugu Songs

Copyright © 2025 Jesus Worship Telugu Songs - All Rights Reserved.

Powered by

This website uses cookies.

We use cookies to analyze website traffic and optimize your website experience. By accepting our use of cookies, your data will be aggregated with all other user data.

Accept